బహుజన రాజ్యం సాధించడమే లక్ష్యం

స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా, పాలకులు మారినా అణగారిన వర్గాల తలరాతలు మారలేదని బహుజన సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విబ్రాం శేఖర్ విమర్శించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బహుజనుల కష్టాలు తీరాలంటే రాజ్యాధికారం ఒక్కటే మార్గమని, ఆ దిశగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఇంచార్జి వరికిల్ల మల్లేష్, జిల్లా అధ్యక్షులు ఇరికిల్ల రాజనర్సయ్య, వరంగల్ జోన్-2 ఛీప్ జోనల్ ఇంచార్జ్ దయానందరావు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్