పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం వరి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రైతుల ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి కటింగ్ జరగకూడదని అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యత పరిశీలించిన ధాన్యాన్ని మాత్రమే రైస్ మిల్లులకు తరలించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కటింగ్ చేయవద్దని సూచించారు.