పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని తమి చెరువు కట్ట ఏరియాలో నివసించే, ఇటీవల మరణించిన జేఎన్టీయూ ఉద్యోగి బొబ్బిలి శ్రీనివాస్ కుటుంబానికి జేఎన్టీయూ కాలేజ్ ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్, వైస్ ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్, లెక్చరర్ కృష్ణారెడ్డి బుధవారం ఘనంగా నివాళులర్పించారు. వారి చిత్రపటానికి పూలు, అక్షతలు వేసి, కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ బొబ్బిలి శ్రీధర్ కూడా పాల్గొన్నారు.