రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో, ఓటర్ జాబితా తయారీతో పాటు ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అతి త్వరలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయ శ్రీహర్ష, డిసిపి కరుణాకర్ పాల్గొన్నారు.