ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామానికి చెందిన యాళ్ల మల్లారెడ్డి వడదెబ్బతో మృతి చెందాడు. కోతల సమయంలో వారం రోజులుగా ఎండలో వ్యవసాయ పనులు చేస్తుండగా తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో అస్వస్థతకు గురై బుధవారం మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.