పెద్దపల్లి: దరఖాస్తు గడువు పొడిగింపు

జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఉపకార వేతనాల దరఖాస్తుల గడువును ఏప్రిల్ 20 వరకు పొడిగించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు (ఫ్రెష్, రెన్యువల్) ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కళాశాలల ప్రిన్సిపల్స్ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా చూడాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్