పెద్దపల్లి: సర్కారు బడిలో చేర్పిస్తే నగదు బహుమానం : సర్పంచ్

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం బడిబాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ జిల రాజు యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. పిల్లలకు బహుమానంగా సంవత్సరానికి 2000 రూపాయలు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్