పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలలో చోరీకి విఫలయత్నం

రామగిరి మండలం కల్వచర్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సాయంత్రం చోరీకి విఫలయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు స్టోర్ రూం తాళాలను పగులగొట్టి, లోపల వస్తువులు లేకపోవడంతో గదిని చిందరవందర చేశారు. పాఠశాల ఆవరణలో పిల్లలు ఆడుకోవడానికి రావడంతో, వారిని చూసి దొంగలు పారిపోయారు. ఈ సంఘటనతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమయ్యారు.

సంబంధిత పోస్ట్