80 శాతం మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి: ప్రభుత్వ విప్

పెద్దపల్లి నియోజకవర్గంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు 80 శాతం వరకు పూర్తయ్యాయని ప్రభుత్వ విప్ విజయరమణరావు తెలిపారు. బుధవారం పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల అధికారులతో, రైస్ మిల్లర్లు, లారీ అసోసియేషన్ వారితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. మిగిలిన కొనుగోళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్