పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టీబీ యూనిట్‌లో సీనియర్ చికిత్స పర్యవేక్షకులుగా పనిచేస్తున్న దేవ తిరుపతికి హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలనలో చేసిన కృషికి గాను అవార్డు లభించింది. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ కెవి సుధాకర్ రెడ్డిలు ఈ పురస్కారాన్ని అందజేశారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.