కాంగ్రెస్ ప్రభుత్వం దిగి రావాలంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇవ్వడం సులభం కానీ, వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమైందని, రెండేళ్లుగా అసమర్థ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడం అవసరమని ఆయన అన్నారు.