ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రైతు వారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.