కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలి: ఎమ్మెల్యే

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. సోమవారం ఎలిగేడు మండలం శివపల్లిలోని తన నివాసంలో సుల్తానాబాద్ మండల కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సమన్వయంతో, కలిసికట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామగ్రామాన వివరిస్తూ, పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం కష్టపడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్