కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం: విప్

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, ధాన్యం కొనుగోలులో గింజ కటింగు ఉండదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. బుధవారం ఆయన ఎలిగేడు, సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో వడ్లు, మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్