ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర: ఎమ్మెల్యే

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు మాట్లాడుతూ, మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం గాంధీ పేరును తొలగించి కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఎంజీఎస్ఆర్డీఎస్ పథకానికి సవరణ చేసి, వీబీ-జీ రామ్ పథకంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాత పథకాన్ని యథావిధిగా కొనసాగించేందుకు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజకీయాలు మానుకొని ప్రజల బాగు కోసం కృషి చేయాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్