రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ, అన్నదాతల ఖాతాలో రైతు భరోసా నిధులు దశలవారీగా జమ అవుతాయని తెలిపారు. మంగళవారం జూలపల్లి మండలం తేలుకుంట గ్రామ రైతు వేదికలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట మంత్రుల చేతుల మీదుగా విడుదల చేసే కార్యక్రమానికి సంబంధించి ఈ సమావేశం జరిగింది.