పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి రైతు వేదికలో సుస్థిర వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ లో భాగంగా కృషి సఖిలకు 5 రోజుల పాటు నిర్వహించే శిక్షణలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా జిల్లాలో 15 క్లస్టర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఒక్కో క్లస్టర్ లో 125 మంది రైతులను ప్రకృతి వ్యవసాయం కోసం ఎంపిక చేశామని, సాగులో మెళకువలు చెప్పేందుకు క్లస్టర్ కి ఇద్దరు మహిళలను కృషి సఖిలుగా నియమించామన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.