పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర శివ పంచాయతన క్షేత్రంలో సీజీఎఫ్ నిధుల ద్వారా రూ. 40 లక్షలతో రాజగోపురం, అర్చకుల వసతి గదుల నిర్మాణానికి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం బొంపల్లి గ్రామంలో శ్రీ రంగనాయకస్వామి వారి రథోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, బొంపల్లి గ్రామ సర్పంచ్ దాడి మౌనిక సంతోష్, ఉపసర్పంచ్ సెల్ రాజు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.