కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే

పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ఆదివారం పెద్దపల్లి మండలం పరిధిలోని పెద్దబొంకూర్, రాఘవాపూర్, రంగాపూర్, మారేడుగొండ, గుర్రాంపల్లి, రాగినేడు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయడం ద్వారా గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్