పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం నాల్గవ గిరిప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి పౌర్ణమికి ఈ యాత్ర నిర్వహిస్తామని ఆలయ కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా స్వామివారి స్మరణతో పెద్దాపూర్ క్షేత్రం మార్మోగింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి గిరిప్రదక్షిణను విజయవంతం చేశారు.