రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు నిట్టూరు విద్యార్థులు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జూనియర్స్ కబడ్డీ పోటీలలో నిట్టూరు విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. శ్రీజ, అవంతిక, శరిష్మాలు నల్లగొండలో ఈ నెల 3 నుండి 5 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిట్టూరు ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, హెచ్ఎం, పీఈటీ పిట్ట భాస్కర్, సిఆర్పి కుంబాల సుధాకర్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్