పెద్దపల్లి: లొంగు'బాట'లో మరో మావోయిస్టు..?

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లా రాజిరెడ్డి తీవ్ర అనారోగ్యం కారణంగా పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ఆయన, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఇదే ఆపరేషన్ లో మావోయిస్టు పార్టీ కీలక సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, చంద్రన్న లొంగిపోయిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్