పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ తెలిపారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 2 స్పెషలిస్ట్, 3 ఎంబీబీఎస్ వైద్యుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ ప్రతులతో హాజరుకావాలని సూచించారు. స్పెషలిస్టులకు నెలకు రూ.1 లక్ష వేతనం అందజేయనున్నారు.