పెద్దపల్లి: హరీశ్‌రావుపై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

మాజీ మంత్రి హరీశ్‌రావుపై ప్రభుత్వ విప్, పెద్దపల్లి MLA విజయరమణరావు తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్ లేని సమయంలో తన ప్రాధాన్యం చాటుకోవాలని హరీశ్ ఆరాటపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విజయరమణరావు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్