పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్ గ్రామంలో ఆదివారం బోనాల పండుగ సందర్భంగా పూజ కోసం గోదావరి నదిలోకి వెళ్లిన పంచిక సదయ్య (48) నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంథని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.