ప్రభుత్వ విప్ విజయరమణరావు మాట్లాడుతూ, రైతులకు అందుబాటులో పెట్రోల్ పంపులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సోమవారం సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలలో భాగంగా రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించిన కన్స్యూమర్ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనలు చేశారు. నియోజకవర్గంలోని 14 సంఘాలలో 11 సంఘాలను ఏకం చేసి, ఎలిగేడు శివారులో 15 వేల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.