రాష్ట్రస్థాయిలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి గుర్తింపు లభించడం పట్ల ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణరావు బుధవారం ఆనందం వ్యక్తం చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్‌ను శాలువాతో సత్కరించారు. తెలంగాణ వైద్య ఆరోగ్య రంగంలో జిల్లా ఆసుపత్రి అరుదైన మైలురాయిని చేరుకుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పురస్కారాల్లో అత్యధిక అవార్డులను సొంతం చేసుకొని రాష్ట్రంలోనే ఉత్తమ ఆసుపత్రిగా నిలిచిందని ఆయన తెలిపారు.