పెద్దపల్లి మండలం పెద్ద బొంకూర్ గ్రామంలో సోమవారం ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు రూ. 2.40 కోట్లతో నిర్మించిన హై లెవెల్ వంతెన, రూ. 12 కోట్లతో నిట్టూరు నుండి కాచాపూర్ వరకు నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి నియోజకవర్గం కోట్ల రూపాయల నిధులతో గతంలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన అన్నారు.