దులికట్ట గ్రామపంచాయతీ గణపతి వద్ద కుంకుమ పూజా కార్యక్రమం

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దులికట్ట గ్రామపంచాయతీ ఆవరణలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నెలకొల్పబడిన గణపతి వద్ద కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించారు. మంగళహారతులు, కుంకుమ, పసుపుతో అమ్మవారికి ఉగ్మ పూజ విగ్రహం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గణేష్ మండప నిర్వహణలో మాట్లాడుతూ దూళికట్ట గ్రామపంచాయతీ ఆవరణలో ప్రతి సంవత్సరం నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕