లక్ష్మిపూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి పట్నాల మహోత్సవం సందర్భంగా, శుక్రవారం పెద్దమ్మ ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్, ముదిరాజ్ సంఘం సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.