శ్రీరాంపూర్: మహిళ ఇంట్లోకి వెళ్లిన వ్యక్తికి ఏడాది జైలు

కాల్వ శ్రీరాంపూర్ మండలం మిర్జంపేట గ్రామానికి చెందిన మూల రజిత ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి సామాన్లు ధ్వంసం చేసిన కేసులో నిందితుడు మూల గడ్డం కిష్టయ్య(కృష్ణ)కు శిక్ష పడింది. 2023 అక్టోబర్ 10న ఇంటి గోడలను డ్రిల్లింగ్ మెషీన్‌తో పగలగొట్టి టీవీ, ఫ్రిడ్జ్, కరెంట్ మీటర్ ధ్వంసం చేశాడు. విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి సునీత నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించినట్లు SI వెంకటేశ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్