పెద్దపల్లి పట్టణంలోని చందపల్లి ఈద్గా వద్ద గురువారం బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయరమణరావు హాజరై ముస్లిం సోదరులతో కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, కౌన్సిలర్లు, మతపెద్దలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.