పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, కాచాపూర్ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్న కాచాపూర్ పాఠశాల సిబ్బందిని ఆయన అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమంగా మధ్యాహ్న భోజనం నిర్వహించిన మూడు పాఠశాలల్లో కాచాపూర్ ఒకటిగా నిలవడం జిల్లాకు గర్వకారణమని తెలిపారు. ఈ సందర్భంగా, ప్రతి పాఠశాలలోనూ నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.