సమ్మక్క సారలమ్మ జాతరకు తారు రోడ్లు: ఎమ్మెల్యే

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, ఇచ్చిన మాట ప్రకారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం గద్దెల వరకు తారు రోడ్లు వేయించినట్లు తెలిపారు. గురువారం సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో సమ్మక్క, సారలమ్మల జాతర సందర్భంగా గద్దెలపై కొలువుతీరిన వనదేవతలకు ఎమ్మెల్యే మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం గోవిందరాజు, పడిగిద్ద రాజులను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. కోటి నిధులతో తారు రోడ్డు నిర్మాణం పూర్తయిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్