పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు శుక్రవారం కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జాంపేట, పెగడపల్లి గ్రామాల్లో సమ్మక్క, సారలమ్మల జాతర సందర్భంగా గద్దెలపై కొలువు తీరిన వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం దాదాపు 8 కోట్ల రూపాయల నిధులతో తారు రోడ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు.