పెద్దపల్లి కలెక్టరేట్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి పెద్దపల్లి పట్టణంలో స్వామి వారి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. పెద్దపల్లి కమాన్ నుంచి అయ్యప్ప గుడి వరకు సాగిన ఈ శోభాయాత్రలో విభిన్న కళారూపాలు, వాయిద్య ప్రదర్శనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవారి ఉత్సవమూర్తులను ప్రత్యేక రథంపై అలంకరించి ఊరేగించారు. ఈ కన్నుల పండుగ శోభాయాత్ర నయనానందకరంగా సాగింది.