జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకమని అన్నారు. గురువారం పెద్దపల్లి మండలం హనుమంతునిపేట గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన మేడగోని శ్రీనివాస్ గౌడ్‌ను నూతన సంవత్సర సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధిలో చురుకుగా పాల్గొని, పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని, గ్రామంలో సమస్యలకు సర్పంచే పరిష్కారకర్త అని, ప్రజలిచ్చిన అవకాశాన్ని బాధ్యతతో నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కురుమ మధుకర్ కూడా పాల్గొన్నారు.