దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించుటకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్లు వేణు, అరుణశ్రీలతో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. దేశ ప్రజలలో 'మనమంతా భారతీయులమే' అనే భావనను సుస్థిరం చేసిన మహనీయుడని, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు సంకల్పాన్ని భావి తరాలు ఆదర్శంగా తీసుకొని, వారి ఆశయ సాధన దిశగా కృషి చేయాలని కోరారు.