పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్కా యశస్విని భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సామాజిక సేవా కార్యక్రమాలు, బీజేపీ పార్టీ బలోపేతం కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పదవి కట్టబెట్టినట్లు నాయకులు తెలిపారు. తన నియామకానికి సహకరించిన అధినాయకత్వానికి యశస్వి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి తనవంతు కృషి చేస్తానని యశస్వి పేర్కొన్నారు.