బీఆర్ఎస్ పార్టీలో చేరిన యువకులు

పెద్దపల్లి మండలంలోని కాపులపల్లి గ్రామానికి చెందిన సంపత్, ప్రవీణ్, రవి అనే పలు పార్టీల యువ నాయకులు గురువారం మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దాసరి మనోహర్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ, పార్టీలో చేరిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, ప్రజలకు సేవ చేయడానికి, గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి బీఆర్ఎస్ సరైన వేదిక అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్