పెద్దపల్లి జిల్లాలో లైసెన్స్ లేకుండా, నిబంధనలు పాటించకుండా దళారులు, బ్రోకర్లు పత్తిని అక్రమంగా కొనుగోలు చేస్తున్నారు. రైతులకు రసీదులు ఇవ్వకుండా, ఎలక్ట్రికల్ కాంటాలకు బదులు పాత కాంటాలతో తక్కువ ధరకు కొనుగోలు చేసి దోచుకుంటున్నారు. ఈ వ్యాపారంలో ఎరువుల వ్యాపారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమ సంపాదనతో భూములు, ప్లాట్లు కొనుగోలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.