కొండగట్టు అభివృద్ధికి 35 కోట్ల నిధులు హర్షనీయం..

తెలంగాణలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.35 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల టీఎన్ఎస్ఎఫ్ పెద్దపెల్లి పార్లమెంట్ అధ్యక్షుడు ఎండి వాజిద్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ, 100 గదుల నిర్మాణం కోసం టీటీడీ నిధులు విడుదల చేయడంతోపాటు, పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం అభినందనీయమని వాజిద్ తెలిపారు. ఈ నిధులతో ఆలయ అభివృద్ధికి మార్గం సుగమమైందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్