RMG కార్పొరేషన్‌లో కొనసాగుతున్న కూల్చివేతలు చిరు వ్యాపారుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. GDK పట్టణ చౌరస్తాలో అభివృద్ధి పనుల పేరుతో తన దుకాణాన్ని కూల్చివేయడంపై మల్లేశం అనే వ్యాపారి ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే తన దుకాణాన్ని కూల్చివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి కూలిపోయిన శిథిలాల మధ్య బైఠాయించి, రోడ్డున పడ్డ తమకు న్యాయం చేయాలని ఆయన కన్నీటితో వేడుకున్నారు.