శ్రీకాంతాచారికి ఉద్యమకారుల నివాళులు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ మలిదశ ఉద్యమ విద్యార్థి అమరుడు శ్రీకాంతాచారి 16వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర సాధన కోసం ఎందరో త్యాగధనులు అసువులు బాసారని, శ్రీకాంతచారి మరణం యావత్ దేశాన్ని ఆలోచింపజేసిందని అన్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి, అన్ని విధాల ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్