హన్మకొండలోని భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా, పెరిక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పెరిక మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. హన్మకొండ, వరంగల్ పెరిక జిల్లా సంఘాల సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంఘం అభివృద్ధి కోసం పెరిక కుల సంఘాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని సంధ్యారాణి అన్నారు.