జాప్యం లేకుండా సిఎంపిఎఫ్ సేవలు

మంగళవారం రామగుండం-3 జీఎం కార్యాలయంలో జరిగిన ప్రయాస్ అవగాహన కార్యక్రమంలో కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ (సిఎంపిఎఫ్) రీజినల్ కమిషనర్లు హరిపచౌరి, డా. కె. గోవర్ధన్ లు మాట్లాడుతూ, జాప్యం లేకుండా ఉద్యోగులకు సిఎంపిఎఫ్ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎన్ సిడబ్యుఎ ఉద్యోగుల రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ 515 పిపిఓ ఆర్డర్స్ ను పర్సనల్ విభాగాధిపతి సుదర్శనంకు అందజేశారు. అన్ని లావాదేవీలు సి-కేర్స్ పోర్టల్ ద్వారానే జరుగుతున్నాయని, ఉద్యోగులు మధ్యవర్తులు లేకుండా పారదర్శకంగా సేవలు పొందవచ్చని వారు వివరించారు.

సంబంధిత పోస్ట్