తితిదే ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన కలెక్టర్

మంథనిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయం, కళ్యాణ మండపం నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం అనువైన స్థలాలను పరిశీలించారు. లక్కేపూర్ శివాని గూడెం గుట్ట ప్రాంతాన్ని సందర్శించిన కలెక్టర్, టీటీడీ ద్వారా మంచి దేవాలయం నిర్మించేందుకు ప్రతిపాదనలు సమర్పించేందుకు వీలుగా స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ నిర్మాణాల కోసం స్థల పరిశీలన జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్