గోదావరిఖని పట్టణంలోని దారి మైసమ్మ, పోచమ్మ, గ్రామ దేవతల ఆలయాలను కూల్చివేసిన రామగుండం కార్పొరేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వన్ టౌన్ పోలీసులకు హిందూ ఐక్య వేదిక ప్రతినిధులు సోమవారం ఫిర్యాదు చేశారు. బీజేపీ నాయకురాలు కందుల సంధ్యా రాణి మాట్లాడుతూ, ఆలయాల కూల్చివేతలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఆలయాలను అదే ప్రదేశంలో పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం ఆగదని ఆమె హెచ్చరించారు.