రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ, జిల్లాలో రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగుకు ప్రాధాన్యత ఇస్తోందని, దీని ద్వారా రైతులు రెట్టింపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. బుధవారం పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష చొరవతో ఆసక్తిగల రైతులకు బోరుబావుల ఏర్పాటు కార్యక్రమం ప్రారంభమైంది.