నేతాజీ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ

పాలకుర్తి మండలంలోని వేంనూరులో సర్పంచ్ కోల లత ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేందర్ సన్నీ, సాయుధ పోరాటాల ద్వారానే స్వాతంత్ర్యం సాధించవచ్చని, ఆజాద్ హింద్ పౌజ్ ఏర్పాటు చేసి ఆంగ్లేయులను ఎదుర్కొన్న సుభాష్ చంద్రబోస్ మహనీయుడని కొనియాడారు. జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్